కేరళలో ఇడుక్కి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. ఇడుక్కి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యకు సోదరి వరుస అయ్యే బాలికపై 2020లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 14 ఏళ్ల ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారణ జరిపిన కోర్టు.. నిందితుడికి నాలుగు జీవిత ఖైదు శిక్షలను విధిస్తూ.. ఈ శిక్షను ఏకకాలంలో అనుభవించాలని ఆదేశాలిచ్చింది. అతడు గరిష్ఠంగా 20 ఏళ్లపాటు జైల్లో గడపాల్సి ఉంటుంది.