ధర్మవరం పట్టణంలోని చెన్నకేశవపురం కాలనీకి చెందిన నూరుల్లా (45) అనే వ్యక్తి గురువారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. నూరుల్లా ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సివుంది.