కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియా గాంధీకి సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గోవా నుంచి తీసుకెళ్లిన కుక్క పిల్లకు ‘నూరీ’ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడా పేరే వివాదాస్పదంగా మారింది. నూరీ అంటే ముస్లిం మహిళ పేరని, పెంపుడు కుక్కకు ఆ పేరు పెట్టి ముస్లిం మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేశారు.