ఏపీలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 'ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదు. చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్ డాక్టర్లను పంపిస్తున్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండింది.' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.