ఇరాన్ హక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇరాన్‌లో మహిళల హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గానూ నోబెల్ శాంతి బహుమతికి ఆమె ఎంపిక అయ్యారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతిని బెలారస్ మానవ హక్కుల న్యాయవాది అలెస్ బిలియాట్స్కీ, రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కి సంయుక్తంగా అందించారు.