టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర ఖజానాను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు దొరికిపోయిన దొంగ, 420. చంద్రబాబు, టీడీపీ ఎన్ని డ్రామాలు చేసినా.. గరిటెలు, పళ్లాలు కొట్టినా ప్రజలు క్షమించరు. చంద్రబాబు లోపలుంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, ఎవరికి పనికొస్తాడు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.