గుంటూరు నగరం పిచుకలగుంట ప్రాంతంలో నివాసం ఉండే ఊటుకూరి డేవిడ్ కు ఓ మహిళతో పరిచయం ఉంది. ఈనెల 4న రాత్రి ఆ మహిళ ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో డేవిడ్ అడ్డుకున్నాడు.ఆమెను బెదిరించి రూ. 10వేలు, ఫోన్, ద్విచక్రవాహనం లాక్కొని పారిపోయాడు.శుక్రవారం బాధితురాలు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa