మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్ శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఓ 19 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. కాలేజీకి వెళుతున్న యువతిని ఓ వ్యక్తి గొడ్డలితో బెదిరించి బలవంతంగా పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది వివరించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.