కృష్ణా జలాలపై న్యాయపోరాటానికి దిగుతామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 'కృష్ణా జలాలపై ఉన్న అడ్డంకులను కేంద్రం తొలగించాలి. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించి మా వాదనలు వినిపిస్తాం. సుప్రీంలో SLP వేసి న్యాయపోరాటం చేస్తాం. కొత్త విధివిధానాలు రూపొందించడానికి మేం ఒప్పుకోం. రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోం. ఏపీ రైతులకు అన్యాయం జరగనివ్వం' అని అంబటి వ్యాఖ్యానించారు.