ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తాం... స్థలాలు ఇప్పిస్తాం అని మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజా నాథ్ స్పందిస్తూ..... కేటీఆర్ ఐటీ కంపెనీలు ఏపీకి పంపిస్తామని చులకన భావనతో మాట్లాడడం.. తమ మనోభావాలను దెబ్బతీసిందన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రాయలసీమకు చావు దెబ్బలాంటిదన్నారు. బీజేపీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ఎన్నికల కోసం వాడుకుందని శైలజానాథ్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పంపిణీపై కొత్త నోటిఫికేషన్ బీజేపీ ఇచ్చిందన్నారు. రాయలసీమకు శ్రీశైలం నీటిని ఇవ్వాలన్నారు. హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టులు మూతపడుతాయని శైలజానాథ్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా అందరినీ కలుపుకుని పోయి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు.