ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనారోగ్యంతో ఏపీ మంత్రి జయరాం మ్ముడి భార్య శారదమ్మ కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 07:00 PM

ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆలూరులో ఆయన మాతృమూర్తి శారదమ్మ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో 'గుమ్మనూరు' గ్రామ సర్పంచ్‌గా శారదమ్మ సేవలందించారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో.. వారి స్వగ్రామమైన గుమ్మనూరులో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి జయరామ్‌ తల్లి శారదమ్మ మరణంపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. పలువురు నేతలు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి జయరాం మరదలు మరణించారు. జయరాం తమ్ముడైన నారాయణ స్వామి భార్య అనారోగ్యానికి గురై మృతి చెందారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె మరణించిన కొద్ది నెలలకే జయరాం తల్లి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa