ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛన్ డబ్బులతో పారిపోయిన ,,,వార్డు సచివాలయ ఉద్యోగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 10:53 PM

విశాఖపట్నం జిల్లా గాజువాకలో వార్డు సచివాలయ అధికారి ఒకరు పింఛన్ డబ్బుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. గాజువాకలోని 65వార్డు సంజీవగిరి కాలనీ సచివాలయంలో విల్సన్‌బాబు అనే వ్యక్తి వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మూడు నెలల కిందట ఈ సచివాలయానికి విల్సన్ బాబు ట్రాన్స్‌ఫర్ మీద వచ్చారు. అయితే అక్టోబర్ నెలకు సంబంధించి పింఛన్లు పంపిణీ చేసేందుకు గతనెల ఆఖర్లో బ్యాంక్ నుంచి విల్సన్ బాబు.. పింఛన్ డబ్బులు విత్ డ్రా చేశారు. అనంతరం ఆ డబ్బులను ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆరోగ్యం బాలేదంటూ విధులకు గైర్హాజరయ్యారు విల్సన్ బాబు. సచివాలయ అధికారులు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. జోనల్ కమిషనర్ విల్సన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.


గత నెల 30వ తేదీన బ్యాంకు నుంచి రూ.లక్షా 40 వేలను డ్రా చేశారు. అయితే ఆ సొమ్మును వాలంటీర్లకు అందజేయలేదు. ఏడో తేదీ వచ్చినా పింఛన్లు అందకపోవడంతో లబ్ధిదారులు శనివారం సచివాలయ అడ్మిన్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది .. సచివాలయ అడ్మిన్‌, వాలంటీర్లు ఈ విషయాన్ని జీవీఎంసీ గాజువాక జోనల్‌ కమిషనర్‌ పి.సింహాచలం దృష్టికి తీసుకువెళ్లారు. వెల్ఫేర్‌ సెక్రటరీ విల్సన్‌బాబు స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. అక్కడ కూడా ఆయన ఆచూకీ తెలియలేదు. ఇంటికి వెళితే తాళం వేసి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారానిక సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa