తిరుపతిలోని కపిలతీర్థం వద్ద ఓ లాడ్జిలో ఈ నెల 5న ఓరియన్ హోటల్లోని 302 గదిలో జంట హత్యలు జరిగిన విషయం తెలిసిందే. భార్య మనీషా.. బావమరిది హర్షవర్ధన్ కైలాష్ దుద్మల్ పై నిందితుడు యువరాజ్ కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం అర్ధరాత్రి వెంట తెచ్చుకున్న కత్తితో ఇరువురినీ మట్టుపెట్టాడు. డీఎస్పీ సురేందర్ రెడ్డి కథనం మేరకు.. మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువరాజ్ తనకున్న ఇంటి స్థలాన్ని 40 లక్షలకు అమ్మి జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన జల్సాలకు అడ్డుపడుతున్న భార్య, బావమరిదిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ ఓరియన్ హోటల్లో రూం తీసుకుని అర్థరాత్రి ఇద్దరినీ హత్య చేశాడు. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.