టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. నేడు సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందని.. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని అంటున్నాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా సగం రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వాళ్ళేనన్నారు. ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు అవినీతిని పసిగట్టి సీబీఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి వచ్చాయని జగన్ అన్నారు. అందుకే చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వను అని తీర్మానం చేశాడన్నారు. గజదొంగల ముఠా వీరప్పన్ అయిన బాబును సమర్ధించడం అంటే పేదవాడిని వ్యతిరేకించటమేనన్నారు. బాబును సమర్ధించడం అంటే నయా జమీందారి వ్యవస్థను సమర్థించటమేనన్నారు.