మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి మాట తప్పారని.. మడమ తిప్పారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.94 వేల కోట్లు మద్యం ద్వారా జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ...... ప్రజల రక్త మాంసాన్ని మద్యం ద్వారా తింటున్నారని, నాసిరకం మద్యం ద్వారా ప్రాణాలు తీసుకుంటున్నారని, మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే.. ఓట్లు అడుగుతామని అన్నారని.. ఆ దమ్ము జగన్కు ఉందా? అని అనిత సవాల్ చేశారు. జగన్ మద్యం బ్రాండ్లలో విషతుల్యం ఉందని, లేబరేటరీలో నివేదికలు అవే చెబుతున్నాయన్నారు.