మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది. ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. మొత్తం 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ డిస్మిస్ చేసినట్టయ్యింది. నిజానికి కోర్టులో చంద్రబాబు పిటిషన్లకు సంబంధించి అంగళ్లు కేసులో బెయిల్ రావొచ్చని భావించారు. ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకు కూడా ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసులో కూడా ఊరట దక్కకపోవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa