రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో దోపిడీ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ మద్యం అమ్మకాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భారీగా మద్యాన్ని దోపిడీ చేస్తూ.. నాసిరకం మద్యం ద్వారా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణాలు తీస్తూ.. దోపిడీ చేస్తూ జగనన్న సురక్షా అంటూ ప్రజల వద్దకు వెళ్తారా..? ఏపీలో జరుగుతోన్న మద్యం కుంభకోణంపై విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిని కోరారు. మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే.. జగన్ క్యాష్ ఏపీ.. క్యాష్ ఏపీ అంటున్నారు. ప్రతేడాది మద్యం అమ్మకాల్లో ఏడు వేల కోట్లకు లెక్కలు ఉండడం లేదు. నాలుగేళ్లల్లో రూ. 28 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలకు లెక్కలు లేవు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్సైట్ ఎందుకు మూసేశారు..?