నూజివీడు ట్రిపుల్ ఐటీలో అంత ర్భాగంగా నడుస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం రక్తదానం చేశారు. శ్రీకాకుళం క్యాంపస్–3 ఇంజినీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సరం విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని 72 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జీవీఆర్ శ్రీనివాసరావు, శ్రీకాకుళం క్యాంపస్–3 ఇన్చార్జ్ షేక్ రియాజ్ హుస్సేన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, ఏవో ప్రదీప్, స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేట్ డీన్ రాము, హాస్పిటల్ కో–ఆర్డినేటర్ శిరీషరాణి తదితరులు పాల్గొన్నారు.