కులగణన చేపట్టకపోతే బీజేపీ గద్దె దిగిపోవచ్చని రాహుల్‌గాంధీ అన్నారు. కులగణనను దేశం మొత్తం కోరుకుంటోందని, దీని కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. దీనికి ఏవో కొన్ని పార్టీలు మినహా అన్ని పార్టీలు మద్దతిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేవలం కులగణనతోనే ఆగిపోకుండా ఆర్థిక సర్వేను కూడా నిర్వహిస్తామని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.