ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని విద్యుత్ శాఖ కార్యాలయ గేట్ సమీపంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టిన సంఘటన సోమవారం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ ను తప్పించబోయి సడన్ గా బ్రేక్ కొట్టడంతో డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏ ప్రమాదం సంభవించలేదు. ఆ సమయంలో రోడ్డుపై ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వాహనదారులు అంటున్నారు.