మళ్లీ జగన్ ఏపీకి సీఎం కావాలని వైసీపీ నేతలు స్లోగన్ తీసుకున్నారని, నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్రజలు మళ్లీ జగన్ సీఎం కావాలని అనుకుంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రం అన్నీ రంగాలలో దివాలా తీసిందని, ‘వై నాట్ 175 అని’ జగన్ అంటున్నారని.. అంటే దొంగ ఓట్లతో మళ్లీ సీఎం కావాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే అన్నీ నియోజకవర్గాలకు వైసీపీ డబ్బు పంపిందని, ముఖ్యమంత్రి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయకుండా చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని, బీజేపీ చెప్పినట్లు ఏపీలో జగన్ పాలన నడిపిస్తున్నారని విమర్శించారు.