తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి దగ్గర ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భక్తులు తమకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గోనే అవకాశం కల్పిస్తామన్నారు. టీటీడీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి 17 వేలకు పెంచారు. అలాగే ఐదు వేలమంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తిస్తాయని చెప్పారు. టీటీడీ పరిధిలోని కార్పోరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి ఏటా 3 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.
కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగులు ఆకాలంగా మరణిస్తే వారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులుకు హేల్త్ స్కీం వర్తింపు చేస్తామన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయించారు. నారాయణగిరిలో హోటల్,అన్నమయ్య భవన్‌లో హోటల్స్‌ని టూరిజం శాఖకు అప్పగిస్తామన్నారు. ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. వరహస్వామి అతిథి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ. 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో టీటీడీ అనుబంధ ఆలయాలు,భక్తులు సంచరించే ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఆ భాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు రూ.25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ పరిధిలోని పాఠశాల విద్యార్దులుకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.. టీటీడీ కళ్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డీజేలకు బదులుగా లలితా గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది.. అలాగే గరుడ సర్కిల్ దగ్గర రోడ్డు వెడల్పకు అభివృద్దికి నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్నాయని, వాహనసేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు వివిధ రాష్ట్రాల నుండి విభిన్న కళారూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల అధికారులతో జేఈవో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కళాప్రదర్శనలకు మంచి స్పందన లభించిందన్నారు జేఈవో. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింతగా భక్తులను ఆకట్టుకునేలా కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. రోజువారీగా ఏయే ప్రాంతం నుండి కళాబృందాలు వస్తున్నాయి, ఎలాంటి ప్రదర్శనలు ఇస్తున్నారనే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మిజోరం, మణిపూర్ తదితర రాష్ట్రాల నుండి కళాబృందాలు వస్తున్నట్టు జేఈవో తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa