గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ మంగళవారం ఉదయం చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్రమాలు జరిగాయని లోకేష్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు మంగళవారం విచారణకు హాజరకావాలని నోటీసులు జారీచేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ఏ-14గా నారా లోకేష్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల వరకు నారా లోకేష్ ను సిఐడీ అధికారులు విచారించనున్నారు.