జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమన్ని ఎలమంచిలి మండలంలో పులపర్తి, అచ్చుతాపురం మండలంలో చోడపల్లి సచివాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కన్నబాబు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలనే సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు.