హమాస్ తీవ్రవాదుల భీకర దాడుల నేపథ్యంలో యుద్ధ పరిస్థితులపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమాన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ యుద్ధాన్ని కోరుకోకపోయినప్పటికీ ముగింపు పలుకుతాం అని హమాస్‌కు ఆయన హెచ్చరిక చేశారు. హమాస్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారీగా దళాలను ఇజ్రాయిల్ రంగంలోకి దించింది. యోమ్ కిప్పుర్ యుద్ధం తర్వాత పెద్ద సంఖ్యలో దళాలను దించడం ఇదే తొలిసారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్ట్ తెలిపింది.