ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నేతాన్యాహూతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు అండగా భారత్ ఉంటుందని, చాలా మంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధకు గురిచేసిందన్నారు.