అమరావతి ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. తన ఆరోగ్య కారణాలను పరిగణలోకి తీసుకోవాలని నారాయణ కోరగా దీనిపై రేపు విచారిస్తామని తెలిపింది. కాగా ఈ కేసులోనే సీఐడీ నోటీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్ నోటీసులను సస్పెండ్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే పునీత్‌ను ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa