అమలాపురంలోని భూపయ్య ఆగ్రహారంలో ఎస్కేబిఆర్ కాలేజీ విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడిన వీడియో సోషల్ మీడియాలో మంగళవారం హల్ చల్ చేస్తుంది. చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండాల్సిన యువత ఇలాంటి ఘర్షణలు పడితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని పలువురు వాపోతున్నారు. ఘర్షణల వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.