ఒంగోలుకు చెందిన శంకర్ గత 25 ఏళ్లుగా చాట్ మసాలా బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శంకర్ కు ఈశ్వర్ అనే కుమారుడు ఉన్నాడు. తన తండ్రి కష్టాన్ని బాల్యం నుండి చూసిన ఈశ్వర్, వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈశ్వర్ వెటర్నరీ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించినప్పటికీ తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ప్రతిరోజూ తన విధులు ముగించిన తర్వాత సాయంత్రం తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది నేటి యువతకు ఎంతో ఆదర్శం.