ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాలు సాధిస్తోందని మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 9వ తేదీ వరకు అంటే తొలి పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,041 వైద్య శిబిరాల్లో.. 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు.