ఏపీ రాష్ట్రంలో వచ్చే నెల 4 నుంచి పాఠశాలల్లో నిర్వహించాల్సిన సమ్మెటివ్-1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. నవంబర్ 3 నుంచి 3,6,9వ తరగతుల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి సాధన సర్వే ఉండటంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 15 నుంచి పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది.