గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో బుధవారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో విద్యుత చార్జీలను తగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.... ఈనెల 14న పాతకొత్తచెరువు సబ్స్టేషన వద్ద జరిగే ధర్నాలో ప్రజలు, రైతులు పాల్గొని జయపద్రం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసారు. విద్యుత చార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 12, 13న ఇంటింట ప్రచారం, 15న సంతకాల సేకరణ కార్యక్రమం, 16న ఏడీఈ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి, రాము, శ్రీనివాసులు, రామాంజినేయులు, సూర్యనా రాయణ, గురుస్వామి, గోవిందు, జిలకర భాస్కర్, వెంకటనాయక్, సాకే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.