రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనెల 16 నుంచి ఈవీఎంలను తొలి దఫా తనిఖీ జరుగుతుందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని భీమవరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి కోరారు. ఈవీఎంల పరిశీలన ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు జరుగుతుందని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ ప్రతి నిధులను నామినేట్ చేయాలని సూచించారు. ఈవీఎంలు ఏమైనా పాడయ్యాయా ? మరమ్మతులు చేపట్టాలా ? యంత్రాలన్నీ ఖచితంగా పని చేస్తున్నాయా లేదా వంటి అంశాలను తనిఖీ చేసి సీల్ వేస్తామన్నారు. ఈ ప్రక్రియలో పొలిటికల్ పార్టీల ప్రతి నిధులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఇప్పుడు తనిఖీ చేసిన ఈవీఎంలనే వచ్చే ఎన్నికలకు వినియోగిస్తామని తెలిపారు.