ఇంటర్ విద్యార్థులు పాస్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్, ఈక్వలెన్సీ, జెన్యూన్‌నెస్ సర్టిఫికెట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా తీసుకునేలా డీజీ లాకర్‌లో ఇంటర్ బోర్డు ఉంచిందని, 2011 నుంచి 2023 వరకు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు వియోగించుకోవాలని ఇంటర్ బోర్డు తెలియజేసింది. డీజీ లాకర్‌తో జ్ఞానభూమిని అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు వెంటనే సర్టిఫికెట్ పొందవచ్చునన్నారు. నెల్లూరు జిల్లా, పొదలకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పలు ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్‌తోపాటు కుల్లూరు, కలువాయి, చేజర్ల కళాశాలల ప్రిన్సిపాళ్లతో డీజీ లాకర్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో మాట్లాడుతూ ... ఇంటర్ విద్యార్థులకు ఆయా ప్రిన్సిపాళ్లు ఒరిజినల్ మార్క్‌లిస్టులను రెండు రోజుల్లో పంపిణీ చేయాలన్నారు. అనంతరం ఆ కాలేజీలో ని విద్యార్థులకు మార్కుల లిస్టులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విష్ణువర్థన్, ఇతర కళాశాలల ప్రిన్సిపాళ్లు అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.