వెలుగు వీవోఏ, మెప్మా ఆర్పీల సమస్యలను పరిష్కరించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ వెలుగు వీవోఏ యానిమేటర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ...... కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న రూ.8 వేలు నేరుగా ఇవ్వడం లేదని వాపోయారు. మహిళా మార్టులు పెట్టి సంఘాలకు కోళ్ళు, గొర్రెలు, మేకలు, గేదెలు పేరుతో టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్, ఎస్కే సుభాషిణి, వివిధ సంఘాల నాయకులు నాగమణి, మేరీ, ఆమని, ఆది లక్ష్మి, జగదాంబ నాయకత్వం వహించారు.