శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.10 లక్షలు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే.... కృష్ణా పార్కు సమీపంలో ఉంటున్న బొండాడ దుర్గారావు స్నేహితుడు బుడ్డి గౌరీశంకర్కి హైదరాబాద్కి చెందిన మణిస్వరూప్ 104లో జిల్లా మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దఫదఫాలుగా రూ.6.10 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడిచినా ఉద్యోగం రాకపోగా, మణిస్వరూప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దుర్గారావు ద్వారా గౌరిశంకర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసినట్టు టూ టౌన్ ఎస్ఐ ఎన్.లక్ష్మణరావు తెలిపారు.