టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులుచేస్తున్న నిరసనలు కొనసాగిస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును నెల రోజులకుపైగా జైల్లో నిర్బంధించారని టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బాబుతో నేను అనే నినాదంతో చంద్రబాబు అరెస్టు సంబందించిన అంశాలతో కరపత్రాలను ముద్రించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలన్నా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కావాలన్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు.