రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామని.. రాట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని.. కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు అన్నారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని.. రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని.. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మలకు అందించామన్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తున్నామని.. మౌలిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందిస్తున్నామని.. వేల కోట్లు ఖర్చు చేసి ఇంటి కలను సాకారం చేస్తున్నామన్నారు. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చారని.. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని.. పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు సీఎం. తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదని.. ఈ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని.. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారన్నారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు కనీసం నెలరోజులపాటు రాష్ట్రంలో ఉన్నారా అని జగన్ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారని.. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ రాష్ట్రంలో ఉండరన్నారు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉందని.. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్.. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అంటూ పవన్‌పై విరుచుకుపడ్డారు. ఆడవాళ్లు, పెళ్లిళ్ల వ్యవస్థపై ఆయనకు ఉన్న గౌరవం ఏంటో ప్రజలు ఆలోచించాలన్నారు. వాడుకోవడం, వదిలేయడంగానే నియోజకవర్గాలుగా ఆయన భావిస్తారంటూ విరుచుకుపడ్డారు.
ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు.. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదన్నారు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం మాత్రమే అన్నారు. వీళ్లకు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం.. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారన్ననారు. వీళ్లంతా ప్రజలతో చేసేది కేవలం వ్యాపారమేనని.. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం.. కానీ పార్టీ, సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామన్నారు. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ పాలసీ అంటూ ధ్వజమెత్తారు. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్.. మట్టి, మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు అన్నారు. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలన్నారు.
సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్ అంటూ మండిపడ్డారు. షూటింగ్ గ్యాప్‌లలో రాష్ట్రానికి వస్తుంటాడని.. 'నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు' అని కూడా అనలేరన్నారు. ప్యాకేజీ స్టార్‌కు ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలని.. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారన్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయన్నారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa