ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి తెరపైకి కోడి కత్తి కేసు,,,ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 13, 2023, 06:40 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. విశాఖ ఎయిర్‌‌పోర్టులో జరిగిన కోడికత్తితో దాడి కేసులో జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌క‌కు నంబర్‌ ఇవ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17కి విచారణ వాయిదా పడింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో లోతైన దర్యాప్తు కోసం చేయాలని సీఎం జగన్ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌‌ను కోర్టు తిరస్కరించింది.. దీన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌కు నంబరు కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో.. ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి దగ్గర విచారణ జరిగింది. కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని.. లోతైన దర్యాప్తు జరపాలని తన పిటిషన్‌లో జగన్ కోరారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని.. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్‌ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఎన్‌ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టైన శ్రీనివాసరావు ఇంకా జైల్లోనే ఉన్నారు.. బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా లాభం లేకుండా పోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com