ఏపీకి టెక్ మహీంద్రా శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించేందుకు మహీంద్రా హాలిడేస్ చైర్మన్, టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నాని సంసిద్ధత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశమైన గుర్నాని స్టార్ హోటల్స్ ఏర్పాటు గురించి సీఎం జగన్కు వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రోత్సాహకాల గురించి జగన్ వివరించారు. టెక్ మహీంద్రా ఒక్కో హోటల్ నిర్మాణానికి రూ.250 కోట్లు చొప్పున ఖర్చు చేయనుందని ప్రతినిధులు తెలిపారు. విశాఖ సహా మూడు పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణం చేపట్టనున్నామని.. వచ్చే రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తామని మహీంద్రా చెబుతోంది. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సీవీఎన్ వర్మ, క్లబ్ మహీంద్రా సీవోవో సంతోష్ రామన్, టెక్ మహీంద్రా విజయవాడ అడ్మిన్ మేనేజర్ బిరుదుగడ్డ జయపాల్ పాల్గొన్నారు.