జగన్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం జనసేన బాధ్యత. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని దోపిడీని నిలదీస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... .ప్రభుత్వం అనేక చీకటి ఒప్పందాలు చేసుకున్న మాట వాస్తవం కాదా. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన మంత్రులు ఏదేదో మాట్లాడుతున్నారు. విద్యాశాఖ మంత్రి సూచనల మేరకే ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను. మంత్రి బొత్స... ఈ నాలుగేళ్లల్లో విద్యాశాఖ ఖర్చు పెట్టిన లెక్కలను చెప్పగలరా..? మీ అగ్రిమెంట్‌లోనే ఈటీఎస్ సంస్థనే టోఫెల్ స్కోర్ కేవలం రెండేళ్లు వ్యాలిడిటీ ఉంటుందని చెప్పింది. ఆ సమాచారం ఆ తర్వాత భద్రపరచలేమని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంతా ఆన్‌లైన్ అని చెప్పిన మంత్రి గారూ.. పేరా 50.1 లో చాలా క్లియర్‌గా చెప్పింది. మరి ఈ సమాచారం మీ దృష్టికి రాలేదా.. మీకు తెలియదా..? టోఫెల్ పరీక్ష అనేది అమెరికాలో చదివే విద్యార్థులకు అడుగుతారు.డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇంజనీరింగ్ నాలుగో ఏడాది, అమెరికా వెళ్లే ముందు పరీక్ష రాస్తారు. మూడో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థులకు టోఫల్ పరీక్ష ఎందుకు..? కోటి ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మంత్రి ఆడుకుంటున్నారు’’ అని నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.