గుంతకల్లు పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. రెండు చెరువు కట్టల చుట్టూ క్రింది భాగమున మొలసిన పిచ్చి మొక్కలును, కంప చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరు గురప్ప యాదవ్, డిఇ రామ్మూర్తి, హేమచంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.