గుత్తి రైల్వే జంక్షన్ కు గుత్తికోట నమూనాను ఆమోదించాలని కోరుతూ గుత్తికోట సంరక్షణ సమితి నాయకులు శుక్రవారం గుంతకల్లు డిఆర్ఎం కార్యాలయంలో డిఆర్ఎం మనీష్ అగర్వాల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ గుత్తికోట నమూనా అధ్బుతంగా కనిపించే ఆప్షన్ 5ను గుత్తి ప్రజలు ఇష్టపడుతున్నారని అన్నారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.