అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి శ్రీ లక్ష్మీనరసింహుడి మూలవిరాట్ కు అభిషేకం, అర్చనలు, తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిద రకాల పుష్పాలతో శ్రీవారిని ఎంతో సుందరంగా అలంకరించారు. స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు.