రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3 వేల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని ఏపీ ఎస్ ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. విజ్ఞానానికి నిలయాలు గా ఉండాల్సిన యూనివర్సిటీ లు సిబ్బంది లేకుండా వెలవెల పోతున్నాయని అన్నారు. వెంటనే పోస్టుల భర్తీ కు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.