రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునీత శనివారం బాబు కోసం మేము సైతం కార్యక్రమం చేపట్టారు. ఆమె ఇంటింటికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఆరోగ్యం పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సైకో జగన్ కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు తెలిపారు.