అన్ని పార్టీలు కలిసి వైసీపీపై పోటీ చేస్తున్నాయని ఐనప్పటికీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు వెయిట్ తగ్గారని టీడీపీ నాయకులు చెబుతున్నారని.. డాక్టర్లు వెయిట్ తగ్గలేదని చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు సమస్య ఉంటే ఖచ్చితంగా హాస్పటల్‌కు తీసుకువెళ్లి చికిత్స చేస్తారని.. కావాలని జైలులో ఉంచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎవరూ చెయ్యరని చెప్పుకొచ్చారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని తన ఉద్దేశమన్నారు.