కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు రైతులని ఆదుకోవాలని రైతులతో కలిసి నిరసన తెలిపారు. రైతుల్ని దగా చేసిన, నకిలీ విత్తనాలు సరఫరా చేసిన ప్రభుత్వం దిగిపోవాలని, పంటలకు సకాలంలో నీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగిపోవాలని నినాదాలు చేశారు. వాటాలు, దోపిడీ, కక్కుర్తి వల్ల నకిలీ విత్తనాలు వచ్చాయన్నారు. మాగాణి వేయవద్దని గత ఏడాది ఎమ్మెల్యే వసంత గ్రామాల్లో డప్పు వేయించారన్నారు. వ్యాపారాలు చేసుకునే ఎమ్మెల్యే సాగునీరు ఎలా అందిస్తాడని దుయ్యబట్టారు. వెంటనే సాగర్ జలాలు విడుదల చేయాలని, రైతులకు క్షమాపణలు చెప్పాలని లేకుంటే తక్షణం మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.