ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య వారం రోజులుగా భీకర పోరు జరుగుతోంది. మొదట ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్ల విరుచుకుపడింది. ఆ తర్వాత సరిహద్దుల్లోని కంచెను తొలగించి మరీ ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి మహిళలు, చిన్నపిల్లలపై అకృత్యాలకు తెగబడ్డారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హమాస్ ఉగ్రవాదుల చర్యలను ప్రపంచం మొత్తం ఖండిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా పోర్న్ స్టార్ మియా ఖలీఫా ట్వీట్లు చేయడం, పోస్టులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఇప్పటికే కొన్ని సంస్థలు మియా ఖలీఫాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తాజాగా ఆమెకు వచ్చే ఆదాయాన్ని పోర్న్ హబ్ వెబ్‌సైట్ నిలిపివేసింది. హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా ఆమె నిలబడటంతోనే మియా ఖలీఫా ఆదాయాన్ని స్తంభింపజేసినట్లు పోర్న్ హబ్ వెల్లడించింది. దీంతోపాటు ఆమెకు లభించే ఆ ఆదాయాన్ని ఇజ్రాయెల్ సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు పోర్న్ హబ్ సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధంలో మియా ఖలీఫా.. హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా ట్విటర్‌లో పోస్టులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే పోర్న్ హబ్ ఇంతటి భారీ నిర్ణయాన్ని తీసుకుంది.
మియా ఖలీఫా హమాస్‌కు మద్దతుగా పోస్టులు పెట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. మియా ఖలీఫాతో చేసుకున్న డీల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్లే బాయ్ మేగజైన్ వెల్లడించింది. వెంటనే తమ ప్లాట్‌ఫారమ్‌లో మియా ఖలీఫా యొక్క "ప్లేబాయ్" ఛానెల్‌ని కూడా తొలగించినట్లు తెలిపింది. మరోవైపు కెనడియన్ బ్రాడ్‌కాస్టర్ అండ్ రేడియో హోస్ట్ అయిన టాడ్ షాపిరో అనే సంస్థ మియా ఖలీఫాతో చేసుకున్న డీల్‌ను రద్దు చేసుకుంది. అయితే ఈ డీల్ ఒప్పందానికి చివరి దశలో ఉండగా.. దాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా చేసిన ట్వీట్ చాలా భయంకరమైందని.. అందుకే ఆమెను తొలగించినట్లు ఆమె భావించాలని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై ట్విటర్ వేదికగా స్పందించిన మియా ఖలీఫా.. "పాలస్తీనాలోని పరిస్థితులను చూసి ఇప్పటికీ మీరు పాలస్తీనియన్ల వైపు ఉండకపోతే.. మీరు తప్పుడు మార్గంలో ఉన్నారని అర్థం. అలాంటి వారికి కాలమే తగిన సమాధానం చెప్తుంది’’ అని ట్వీట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa