క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 21 నుంచి 12 జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సేవలు ప్రారంభించనుంది. కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ తో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఆస్పత్రిలో క్యాన్సర్ యూనిట్ కు ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించింది.